వనపర్తి: సాంస్కృతిక కార్యక్రమాలతో గణేష్ ఉత్సవాలు నిర్వహించిన నిర్వాహకులను సన్మానించిన వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్
మంగళవారం వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయంలో గణేష్ నిమజ్జనం గణేష్ ఉత్సవాల శోభాయాత్ర సాంస్కృతిక కార్యక్రమాలలో సాంప్రదాయ బద్దంగా నిర్వహించినందుకు గణేష్ మండపాల నిర్వాహకులకు డీజే యజమానులకు జానపద కళాకారులకు సంస్కృతిక మండలి సభ్యులకు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనుమరుగవుతున్న సాంస్కృతిక సాంప్రదాయాలను మళ్లీ పునర్జీవనాన్ని ఇచ్చిన గణేష్ మండపని నిర్వాహకులు అందరికీ అభినందించారు మన సాంప్రదాయాన్ని భావితరాలకు అందించాలని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు తదితరులు ఉన్నారు.