మాల్యం పగిరి రోడు గుండా ఆర్టీసీ బస్సులు తిప్పకపోవడంతో కణేకల్లు మండల కేంద్రం నుంచి ఉరవకొండ వెళ్లే ప్రయాణీకులు అష్టకష్టాలు పడుతున్నారు. వేదవతి-హగరి నది ఉధృతితో కణేకల్లు - మాల్యం గ్రామాల మద్య రాకపోకలు స్థంబించాయి. అయితే ఇటీవల నది ఉధృతి తగ్గడంతో రోడ్డు మరమ్మతులు చేపట్టారు. అయితే ఆర్టీసి అధికారులు మాత్రం ఆ రూటులో ఆర్టీసి బస్సులు తిప్పడం లేదు. రాయదుర్గం నుండి వెళ్లే బస్సులు కణేకల్లుకు ఉరవకొండ నుంచి వచ్చే బస్సులు మాల్యం వరకూ మాత్రమే తిప్పుతున్నారు. రూ. 20 వెచ్చించి ఆటోలలో మాల్యం వరకూ వెళ్లి అక్కడ బస్సు ఎక్కాల్సి వస్తోందని పలువురు ప్రయాణికులు గురువారం సాయంత్రం తెలిపారు.