రాయచోటి: హోంగార్డ్స్ నైపుణ్యాభివృద్ధికి జిల్లాలో భారీ మొబలైజేషన్ ప్రారంభం
అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో హోంగార్డ్స్ వృత్తి నైపుణ్యాల పెంపు లక్ష్యంగా ప్రత్యేక మొబలైజేషన్ శిక్షణా కార్యక్రమం బుధవారం పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, హోంగార్డ్స్ విధుల్లో మరింత సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి, క్రమశిక్షణను మెరుగుపరచుకోవడానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. స్క్వాడ్ డ్రిల్, ఆమ్స్ డ్రిల్, లాఠీ డ్రిల్, బందోబస్తు విధులు, ట్రాఫిక్ నిర్వహణ, మాబ్ కంట్రోల్ వంటి అంశాలలో సమగ్ర తర్ఫీదు అందించనున్నట్లు తెలిపారు.