తాడిపత్రి: తాడిపత్రిలోని 30వ వార్డులో రెవెన్యూ సచివాలయ సిబ్బందితో కలిసి రేషన స్మార్ట్ కార్డులను పంపిణీ చేసిన కౌన్సిలర్ మల్లికార్జున
తాడిపత్రిలోని 30వ వార్డ్, భగత్ సింగ్ నగర్ కాలనీలో మంగళవారం సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 30వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి మల్లికార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తపల్లి మల్లికార్జున మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీలో గత ప్రభుత్వం లాగా ఎవరి ఫోటో వేయకుండా, కేవలం ఆంధ్రప్రదేశ్ అధికారిక ముద్రణ మాత్రమే వేసి స్మార్ట్ రేషన్ కార్డును కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తోందన్నారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ వల్ల రేషన్ సమాచారం తెలుసుకోవచ్చన్నారు.