నాదెండ్ల మండలం అమీన్సాహెబ్ పాలెం వద్ద పొంగిన వాగు,రాకపోకలకు అంతరాయం
పల్నాడు జిల్లా,నాదెండ్ల మండలం అమీన్సాహెబ్ పాలెం వద్ద గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండ కాలువ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సోమవారం సాయంత్రం 4గంటలకు వరద నీరు రోడ్డుపైకి చేరి, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.