బోయిన్‌పల్లి: మండల కేంద్రంలో ఘనంగా డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు
రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయిన్పల్లి మండల కేంద్రంలో బిజెపి మండలాధ్యక్షుడు ఆధ్వర్యంలో ఆదివారం 12:50PM కి శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు,ఈ సందర్భంగా పరశురాం మాట్లాడుతూ,స్వతంత్ర భారత రాజకీయ ఆకాశంలో సిద్ధాంతరహిత రాజకీయాలు స్వార్థ పదవీ వ్యామోహలు కారు మబ్బులు కమ్ముకున్న తొలి దినాల్లో ఒక మెరుపు మెరిసి మాయమైంది,ఆ మెరుపు క్షణకాలమే కావచ్చు కానీ గాఢాంధకారంలో భవిష్యత్తులో మునిగి ఉన్న భారత ప్రజానీకానికి ఆ మాత్రం వెలుగు చారన్నారు,భారతీయ జనసంఘ అనే వాస్తవమైన సిద్ధాంతిక రాజకీయపదాన్ని కనుగొనడానికి నూతన లక్ష్యాన్ని ప్రసాదించారన్నారు,