దర్శి: ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ను తిలకించిన దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని గడియారం స్తంభం సెంటర్ వద్ద ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా ఇండియా సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్ వస్తున్న నేపథ్యంలో టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టెపాటి లక్ష్మీ ఆధ్వర్యంలో భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. అభిమానులతో కలిసి ఆమె స్వయంగా క్రికెట్ టోర్నమెంట్ ని తిలకించారు. మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని దేశ భావితరాలకు ఆదర్శంగా నిలబడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.