కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీష్ పూజ చేసి డబ్బు రెట్టింపు చేస్తామని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఒక ఎయిర్ గన్, కత్తి, ఎన్ని పాయింట్ ఐదు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 18న దుండిగల్ లోని ఓ ఇంట్లో పూజ పేరుతో డబ్బులు ఎత్తుకెళ్లినట్టు తెలిపారు. సోమవారం నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని, మరో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి తెలిపారు.