కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సూరారంలో భారతదేశ ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పర్యావరణ ప్రేమికులు, సామాజిక వేత్త కోల రవీందర్ ముదిరాజు అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా సూరారం చౌరస్తాలో నార్త్ సిటీ పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కోల రవీందర్ ముదిరాజ్ మాట్లాడుతూ అప్పటి నైజాం పాలనలో హైదరాబాదును విలీనం చేసిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు. విద్యార్థులు వారి అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు.