కొండపి: మర్రిపూడి మండలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సమీపంలో జలపాతాన్ని తలపిస్తున్న మంచినీరు కోనేటి అలుగు
ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలకు మర్రిపూడి మండలంలోని పొదిలికొండ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పరిధిలో ఉన్న మంచినీటి కోనేరుల నుంచి కొండ కిందకు శ్రావ్యమైన శబ్దాలతో భైరవకోన జలపాతాన్ని తలపిస్తున్నాయి. ఈ జలపాతాన్ని చూసేందుకు రోజూ పదుల సంఖ్యలో వస్తున్నారు. ఈ జలపాతాన్ని వీక్షించిన స్థానికులు జలపాతం వరకు రోడ్డు మార్గం ఏర్పాటు చేసి ఉంటే బాగుంటుందని, తమ అభిప్రాయాలు చెప్పుకుంటున్నారు.