పులివెందుల: మొంథా తుఫాన్ ఎఫెక్ట్, పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న వేంపల్లి పాపాఘ్న నది
Pulivendla, YSR | Oct 28, 2025 మొంథా తుఫాను ప్రభావంతో పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగా ఉదయం నుంచి వర్షం కురుస్తుంది. ఈ వర్షానికి తోడు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వేంపల్లి సమీపంలోని పాపాగ్ని నది పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది. దీనికి తోడు ఎగువున ఉన్న వెలిగండ్ల ప్రాజెక్టు గేట్లను ఎత్తి 750 క్యూసెక్కుల నీటిని పాపాగ్ని నదికి విడుదల చేశారు పాపాగ్ని నది పరివాహక ప్రాంతం వైపు చక్రాయపేట మండల ప్రజలు వేంపల్లి మండల ప్రజలు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని పోలీసులు రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.