జమ్మలమడుగు: బద్వేల్ : మండలంలోని గుండంరాజు పల్లెలో తుఫాను కారణంగా నీట మునిగిన వరి పంట
కడప జిల్లా బద్వేల్ మండలంలోని గుండం రాజు పల్లెలో తుఫాను కారణంగా వరి పంట నీట మునిగినట్లు బుధవారం స్థానికులు, రైతులు తెలిపారు. కోతకు వచ్చే సమయానికి వరి పంట పొలాల్లోకి నీరు చేరడంతో వరి పంట నేలవారినట్లు రైతులు తెలిపారు.పొలంలోనే మొలకలు రావడంతో కన్నీరు మున్నీరు రైతులు అవుతున్నారు. తమను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రైతున్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.