మిర్యాలగూడ: పట్టణంలో వైష్ణవి గ్రాండ్ రెస్టారెంట్ లో జరిగిన చోరీ కేసును చేదించిన పోలీసులు, ముగ్గురు అంతర్ రాష్ట్ర నిందితులు అరెస్టు
నల్గొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణంలోని సబ్ డివిజన్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మంగళవారం సాయంత్రం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైష్ణవి గ్రాండ్ రెస్టారెంట్ లో ఈనెల 5న జరిగిన భారీ చోరీ కేసులో చోరీకి పాల్పడిన మహమ్మద్ రహీం ఖాన్ మరియు అతని ఇద్దరు స్నేహితులు ఇక్బాల్ ఖాన్, లాలూ ఖాన్ అనే ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుండి రూ.66.50 లక్షల నగదు, ఒక బైక్, మూడు సెల్ ఫోన్లు, సుత్తి, స్క్రూ డ్రైవర్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.