15 మందికి 12 లక్షల 30 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన - వెంకటగిరి MLA కురుగొండ్ల రామకృష్ణ
Gudur, Tirupati | Sep 17, 2025 అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన వెంకటగిరి నియోజకవర్గంలోని పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 15 మందికి 12 లక్షల 30 వేలు రూపాయల ఆర్థిక సహాయాన్ని (CMRF చెక్కులు) తిరుపతి జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పంపిణీ చేసారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి సహాయనిది లబ్ధిదారులకు అందలేదన్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల పాలిటి ముఖ్యమంత్రి అన్నారు.. కూటమి ప్రభుత్వం పేదల పక్షణా ఉంటుందన్నారు