ఆటోడ్రైవర్లకు ఉపాధి కల్పించాలని గాజువాక నుంచి చేపట్టిన ఆటోడ్రైవర్ సైకిల్ యాత్ర భీమడోలు చేరిక
Eluru Urban, Eluru | Sep 16, 2025
ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి ఆటో డ్రైవర్లు వ్యతిరేకం కాదని గాజువాకకు చెందిన ఆటోడ్రైవర్ సిరియాల హరే రామ్ అన్నారు. స్త్రీశక్తి పథకంతో ఉపాధి కోల్పోయిన ఆటోడ్రైవర్లకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలని కోరుతూ గాజువాక నుంచి అమరావతికి సైకిల్ యాత్ర చేపట్టిన సిరియాల హరే రామ్ మంగళవారం భీమడోలు జంక్షన్ కు చేరుకున్నారు. ఈసందర్భంగా స్థానిక శ్రీవెంకటేశ్వర ఆటోయూనియన్ నాయకులు స్వాగతం పలికారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ 400 కిలోమీటర్ల మేర ప్రయాణించి ఈ నెల 20న విజయవాడ చేరుకుంటానని తమ సమస్యలను సీఎం చంద్రబాబుకు వినతిపత్రం ద్వారా అందజేస్తానని పేర్కొన్నారు.