కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే, వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, వైసీపీ నాయకులతో కలసి మంగళవారం కడప నగరంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నట్లు నాయకులు తెలిపారు.ఈ సందర్బంగా వారు రేపు బుధవారం జరగబోయే మెడికల్ కాలేజిల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కడప జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో నిర్వహించబోయే ర్యాలీ గురించి జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ని కలుసుకొని వినతి పత్రం అందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, పులి సునీల్ కుమార్, షఫీ షిండే అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.