భువనగిరి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్య కళ్యాణ మహోత్సవం
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం నిత్య కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ మండపంలో సుదర్శన నర్సింహ హోమం నిర్వహించిన అనంతరం వేదమంత్రోచరణలు, మంగళ వాయిద్యాల మధ్య లక్ష్మీనరసింహుని కళ్యాణం కన్నుల పండుగా నిర్వహించారు. విశ్వక్ కేసన ఆరాధన రక్షాబంధన్ మాంగల్య ధారణ తలంబ్రాల కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. స్వామివారికి మొక్కులు భక్తులు చెల్లించుకున్నారు.