సోమందేపల్లిలో జవాన్కు ఘన స్వాగతం
శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలం చల్లాపల్లి గ్రామానికి చెందిన అనిల్ కుమార్ రెడ్డి 17 ఏళ్ల దేశ సేవ అనంతరం స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. శనివారం మధ్యాహ్నం ఆయన సొంత గ్రామానికి చేరుకోగా, గ్రామస్థులు, మిత్రులు ఘన స్వాగతం పలికారు. చాకర్లపల్లి వద్ద నుంచి చల్లాపల్లి వరకు బ్యాండ్ మేళాలతో ఊరేగింపు నిర్వహించారు. బాణాసంచా కాలుస్తూ 'భారత్ మాతాకీ జై' అంటూ నినాదాలు చేశారు.