భువనగిరి: భువనగిరి నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం: భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ప్రజల సమస్యలను నేరుగా తమ వద్దకు తీసుకురావాలని ప్రజా సమస్యల పరిష్కారమధ్యయంగా ముందుకు వెళ్తామన్నారు.నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామన్నారు.