రాయచోటి:దిత్వా తుఫాను వేళ పోలీసులు పూర్తి అలర్ట్: ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
దిత్వా’ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ సర్వసన్నద్ధమైందని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ తెలిపారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక రెస్క్యూ బృందాలు, కమ్యూనికేషన్ ఏర్పాట్లు, సహాయక సామగ్రి సిద్ధం చేసినట్లు వెల్లడించారు.ఎస్పీ గారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 కు కాల్ చేయాలని సూచించారు. ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరించారు.లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయగా, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ, రహదారి భద్రత చర్యలు చేపట్టినట్టు తెలిపారు.