వరదయ్యపాలెం మారేడు కాలువ పొంగి ప్రవహిస్తుంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సూచనలు
వరదయ్య పాలెంలో మారేడు కాలువ పొంగి ప్రవహిస్తోంది. అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ముంపు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వర్షం ఉధృతి పెరిగితే వారిని పునరావస కేంద్రాలకు తరలించే ఏర్పాటు చేస్తామని ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. ప్రజలు వాగులు, వంకల వద్దకు వెళ్లవద్దని ఎస్ఐ కోరారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.