ఆకాంక్షిత బ్లాక్ జిల్లాలోని తిర్యాణి మండలంలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శుక్రవారం ASF జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆకాంక్షిత బ్లాక్ తిర్యాణి మండలంలో చేపట్టవలసిన మౌలిక వసతుల పనులపై విద్య, వైద్య-ఆరోగ్య, శిశు సంక్షేమ, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఆకాంక్షిత బ్లాక్ తిర్యాణి మండలంలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అంగన్వాడి భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు