అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని 5, 22వ వార్డులలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం పట్టణంలోని 5, 22వ వార్డులలో పట్టణ అధ్యక్షుడు ఖలీల్, నాయకులు దౌలా, కేశవ, మజహర్, బాషాలు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా కాలనీలలో ఇళ్ల వద్దకు వెళ్లి పీపీపీ విధానం వల్ల కలిగే నష్టాన్ని ప్రజలకు వివరించి వాటికి వ్యతిరేకంగా సంతకాలను సేకరించారు. మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడితే ప్రైవేట్ పరం చేస్తున్నారని అన్నారు.