సిర్పూర్ టి: మున్సిపల్ కార్యాలయంలో కూర్చోవడానికి కుర్చీలు లేకపోవడంతో మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేసిన జర్నలిస్టు సంఘాలు
కాగజ్నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కూర్చోవడానికి కుర్చీలు లేక వివిధ పనుల నిమిత్తమై కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో స్పందించిన టి డబ్ల్యూ జేఎఫ్ నాయకులు మున్సిపల్ కమిషనర్ రాజేందర్ కు గురువారం వినతిపత్రం అందజేశారు. ఇటీవల ఓ వృద్ధురాలు కార్యాలయానికి వచ్చి నిలబడి నిలబడి ఓపిక నశించి స్పృహతప్పి పడిపోవడంతో అలాంటి ఇబ్బందులు ఎవరూ పడకుండా వచ్చే ప్రజలకు కుర్చీలు ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు.