జగిత్యాల: మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలను ఆకస్మిక తనిఖీచేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే జిల్లా కేంద్రం లో ని తెలంగాణ మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలను మధ్యాహ్నం 12-30 గంటల ప్రాంతంలో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ఆకస్మిక తనిఖీచేసి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వం డైట్ చార్జీలు పెంచిందని ప్రస్తుతం ప్రతి రోజు అందించే మెనూ ఎలా ఉంటుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.చదువుల్లో వెనకబడిన విద్యార్థులకు స్పెషల్ క్లాస్ లు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.