వెంకటగిరిలో సీఐ ఏవి రమణ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు.. పత్రాలులేని 16 బైకులు.. 3 ఆటోలు స్వాధీనం
వెంకటగిరి సమీపంలోని టిడ్కో ఇళ్ల వద్ద ఆదివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. సీఐ ఏవీ రమణ ఆధ్వర్యంలో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. పత్రాలు లేని 16 బైకులు, 3 ఆటోలను స్వాధీనం చేసుకొని స్టేషన్కు తరలించారు. సీఐ మాట్లాడుతూ.. చట్టవ్యతిరేక కార్యక్రమాలను నిర్మూలించేందుకే కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని చెప్పారు.