కుప్పం: టీడీపీ సీనియర్ కార్యకర్త మునుస్వామి మృతి పార్టీకి తీరని లోటు: ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్ పీఎస్ మునిరత్నం
కుప్పం మండలం కంగుంది టిడిపి సీనియర్ కార్యకర్త మునుస్వామి మృతి చెందడం పార్టీకి తీరని లోటని ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం సోమవారం నాడు ఉదయం పది గంటల ప్రాంతంలో పేర్కొన్నారు. మునుస్వామి భౌతికకాయానికి టిడిపి నేతలతో కలిసి మునిరత్నం పూలమాలవేసి నివాళులు అర్పించారు. టిడిపి వీరాభిమాని మునుస్వామి అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.