కోడూర్: ఇది....... జాతీయ రహదారి పరిస్థితి.....!
పేరుకు మాత్రమే జాతీయ రహదారి ఆయనప్పటికీ, ఈ రోడ్లు మారుమూల గ్రామానికి వెళ్లే మార్గాన్ని తలపిస్తున్నాయి. కోడూరు నుంచి తిరుపతికి ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కోడూరు మార్కెట్ యార్డ్ నుంచి మాధవరం పోడు వరకు అలాగే బాలపల్లి నుంచి మా ముండూరు వరకు రోడ్ల పరిస్థితి దయనీంగ ఉంది. విమర్శలు వెల్లువెతకడంతో వర్షాలు తగ్గితే మరమ్మత్తులు చేపడతామని జాతీయ రహదారుల అధికారులు తెలిపారు.