నంద్యాల పట్టణంలోని రైతు నగరంలో కొలువుదీరిన గౌరీ కేదార్నాథ్ స్వామి ఆలయంలో పుష్యమాసం ను పురస్కరించుకొని శివదీక్ష తీసుకున్న స్వాముల సమక్షంలో మంగళవారం బస్మాభిషేకం నిర్వహించారు. ఆలయ వేద పండితులు ఉదయ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి రుద్రాభిషేకం, బిల్వర్చన, బస్మాభిషేకం కార్యక్రమాలను నిర్వహించి శివనామస్మరణల నడుమ మంగళహారతి ఇచ్చారు.అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.