నంద్యాల జిల్లా డోన్ మండలం గోసానిపల్లె గ్రామ సమీపంలో గురువారం ప్రమాదం తప్పింది. డోన్‌కు వెళ్లే మార్గంలో గోసానిపల్లె దగ్గర ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఆటోలో ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలవ్వడంతో స్థానికులు సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.