సూళ్లూరుపేటలో నరేంద్ర మోడీ జన్మదిన సేవా పక్షోత్సవాలలో బిజెపి ఆద్వర్యంలో రక్తదాన శిబిరం
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట బిజెపి ఆద్వర్యంలో ఈ నెల 17 వ తేదీ నుండి వచ్చే నెల 2 వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సేవా పక్షోత్సవాలను పురస్కరించుకొని రక్తదాన శిబిరం నిర్వహించారు. సేవా పక్షోత్సవాల కమిటీ సభ్యులు సాగర్, నూతలపాటి శ్రీనివాసులు, మన్నెముద్దు పద్మజ పర్యవేక్షణలో ఆదివారం స్థానిక R & B బంగ్లాలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సూళ్లూరుపేట అర్బన్ ఇన్చార్జ్ ఆరణి విజయభాస్కర్ రెడ్డి, సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జి ఎద్దుల నరేంద్రారెడ్డి చేతులు మీదుగా ప్రారంభించారు. పలువురు యువత రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు చెన్నకే