చిలకలూరిపేట అన్ని వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని 38వ వార్డులో గత 7, 8 నెలల కాలంలో అత్యధిక అభివృద్ధి పనులు జరిగాయనీ మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని తెలిపారు. సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పోల్ రెడ్డి పాలెం లో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన అనంతరం మాట్లాడడం జరిగింది. నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రత్తిపాటీ పుల్లారావు ఆధ్వర్యంలో పట్నంలోని అన్ని వార్డులోనూ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.