పిపిపి ద్వారా మెడికల్ కాలేజీలను తనకు కావలసిన వారికి చంద్రబాబు కట్టబెడుతున్నాడు :నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి
Nandyal Urban, Nandyal | Nov 12, 2025
నంద్యాల పట్టణంలో మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ బుధవారం వైసిపి ఆధ్వర్యంలో ప్రజా వ్యతిరేక ఉద్యమ ర్యాలీ నిర్వహించారు. నూనెపల్లి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు సాగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్ జగన్ తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీ లను సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్రైవేటీకరణ చేస్తున్నాడని విమర్శించారు. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ తెలియక పోయారని తెలిపారుతో తనకు కావలసిన వారికి మెడికల్ కాలేజీ లను చంద్రబాబు కట్టబెడుతున్నారన్నారు