కడప జిల్లా కమలాపురం మండలం మీరాపురం గ్రామంలో బుధవారం వేపచెట్టు నుంచి పాల నురగ లాంటి తెల్లటి ద్రవం కారుతుండడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. విషయం తెల్సిన వెంటనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆసక్తితో తరలివచ్చి ఆ చెట్టు నుండి కారుతున్న పాలను తిలకించారు. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెట్టుకు పాలు కారుతాయని తెలిపిన విషయం ఈ సందర్బంగా ప్రజలు గుర్తు చేసుకున్నారు. మరేదైనా కారణమా అనే దానిపై గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.