పట్టణంలోని బీసీ బాలుర హాస్టల్ లో విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారం గురించి ఆరా తీసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
విద్యార్థుల పౌష్టికాహారంపై MLA ఆరా శ్రీకాళహస్తిలోని బీసీ బాలుర హాస్టల్లో బుధవారం ఆర్వో ప్లాంట్ను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారం గురించి ఆరా తీశారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా 15 రోజులకు ఒకసారి తాను అందుబాటులో లేకపోతే తమ తల్లి బృందమ్మ, సతీమణి రిషితా రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని తెలియజేశారు.