హిమాయత్ నగర్: రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎందుకు పార్టీ మారారో తెలుసు : మాజీ మంత్రి కేటీఆర్
తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకులతో మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో రెండేళ్లలో మన ప్రభుత్వమే వస్తుందని తెలిపారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎందుకు పార్టీ మారారో తెలుసని అన్నారు. సుల్తాన్పూర్, గన్షి మియా గూడా స్టోరీలు బయటపడతాయని అప్పుడు మీ అందరి సంగతి చూస్తామని తెలిపారు. పహిం సంగతి కూడా చూస్తామని మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.