పీలేరులో లోన్ యాప్ వేధింపులతో చికెన్ సెంటర్ యాజమాని ఆత్మహత్య
పీలేరు మండలం పీలేరు పట్టణంలోని పీలేరు కడప రోడ్డులో చికెన్ సెంటర్ నడుపుతున్న షేక్ ముబారక్ (25)అనే యువకుడు లోన్ యాప్ లో అప్పు తీసుకున్నాడు. అయితే సమయానికి డబ్బు చెల్లించలేక పోవడంతో లోన్ యాప్ వారు డబ్బు చెల్లించాలని వేధించడం మొదలుపెట్టారు. అంతే గాకుండా అప్పుల వసూళ్ల పేరుతో భార్య ఫోన్‌కు అసభ్యకర ఫోటోలు పంపారు. ఈ వేధింపులను తట్టుకోలేక మనస్తాపానికి గురయ్యాడు.తన షాపులో ఎలుకల కోసం ఉంచిన ఎలుకల మందును మంగళవారం సాయంత్రం సేవించాడు. అపస్మారక స్థితిలో ఉన్న ముభారక్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.