ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో అశ్వియుజమాస బ్రహ్మోత్సవాలకు శరవేగంగా ఏర్పాట్లు
Eluru Urban, Eluru | Sep 30, 2025
ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చినవెంకన్న ఆశ్వియూజ మాస బ్రహ్మోత్సవాలకు సరవెగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్టోబర్ 2 వ తేదీ నుంచి 9 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు మంగళవారం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజైన 2.తేదీ స్వామి అమ్మవార్లను పెండ్లికొడుకు పెండ్లి కూతుర్లుగా అలంకరిస్తారు,3 న ధ్వజారోహణ,5 రోజు ఎదుర్కోల ఉత్సవం, ఇక 6 వ తేదీ స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం, 7 న రోజు స్వామివారి రథోత్సవం, 8వ తేదీ చక్రస్నానం, 9వ తేదీ రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపు సేవతో ఉత్సవాలు ముగియనున్నాయి.