సండే ఎమ్మెల్యే సండే తప్ప మిగతా రోజులలో కనపడడు,, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి పై సెటైర్లు వేసిన టిడిపి యువ నాయకులు భూమా
Nandyal Urban, Nandyal | Sep 15, 2025
నంద్యాల మెడికల్ కాలేజీ పై మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి వ్యాఖ్యలపై టిడిపి రాష్ట్ర యువ నాయకులు భూమా జగత్ విఖ్యాత రెడ్డి స్పందించారు నంద్యాలలో సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.నంద్యాలలో సండే ఎమ్మెల్యే పూర్తిస్థాయిగా ఉండి మెడికల్ కాలేజీ ల గురించి మాట్లాడాలని అన్నారు. ప్రభుత్వం ఇప్పుడు నిర్వహిస్తున్న పద్ధతిలోనే మెడికల్ కాలేజీల నిర్వహణ ఉంటుందని కొత్తగా వచ్చే మెడికల్ కాలేజీలku ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం ఉంటుందని తెలిపారు. ప్రైవేటు వ్యక్తుల ద్వారా మెడికల్ కాలేజీ పనులు త్వరగా పూర్తయి విద్యార్థులకు న్యాయం జరుగుతుందని సూచించారు