అదిలాబాద్ అర్బన్: బతుకమ్మ పండుగకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించింది: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా
బతుకమ్మ పండుగకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించిందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మంగళవారం ఆదిలాబాద్లో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మకు పూజలు చేసి వేడుకలు ప్రారంభించారు. అనంతరం ఉద్యోగులతో కలిసి దాండియా ఆడి సందడి చేశారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. ఆయనతో పాటు అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.