కుప్పం: కుప్పంలో సిగరెట్ కోసం యువకుల వీరంగం
కుప్పం మున్సిపాలిటీ యలెజనూరులో సిగరెట్ కోసం అర్ధరాత్రి యువకులు వీరంగం సృష్టించారు. గ్రామంలో చిల్లర కొట్టు నడుపుతున్న నాగరాజు దుకాణం వద్దకు వచ్చి సిగరెట్ కావాలని యువకులు గొడవపడ్డారు. సిగరెట్ ఇవ్వకపోవడంతో నాగరాజుపై నలుగురు విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ నాగరాజును చికిత్స నిమిత్తం కుప్పం PES ఆసుపత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేపట్టారు.