నాయుడుపేట వద్ద స్వర్ణముఖి నదికి భారీ వరద నీరు
తిరుపతి జిల్లా నాయుడుపేటలో గత నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వర్షాలకు నాయుడుపేటలోని స్వర్ణముఖి నదికి భారీ నీటి ప్రవాహం చేరుకుని ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. నాయుడుపేట నుంచి మేనకూరు, వెంకటగిరి వైపు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు తెలియజేశారు. గురువారం కూడా వర్షం పడితే స్వర్ణముఖి బ్రిడ్జి పొంగిపొర్లే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు.