హోటల్ పరిశ్రమను స్విగ్గి, జొమాటో కంపెనీలు నాశనం చేస్తున్నాయని అమరావతి హోటల్ అధినేత అమరావతి కృష్ణా రెడ్డి అన్నారు. నెల్లూరు లో మంగళవారం హోటల్ నిర్వాకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. హోటల్ పరిశ్రమ ఎన్ని వేలమందికి ఉపాధి కల్పిస్తుందని అన్నారు.ఏ ఊరెళ్లినా ఆదరించి అన్నం పెట్టె హోటల్ పరిశ్రమ ఈనాడు కష్టాలలో ఉందని అన్నారు.