భీమిలి: రుషికొండ సముద్రంలో గల్లంతైన యువకుల
మృతదేహాలు లభ్యం
రుషికొండ సముద్రం లో ఆదివారం సాయంత్రం గల్లంతైన ఇద్దరి యువకుల మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. పీఎం పాలెం ప్రాంతానికి చెందిన పదో తరగతి విద్యార్థులు సంజయ్, సాయి శ్యామ్ మరో ఇద్దరు సముద్ర స్నానం చేస్తుండగా గల్లంతయ్యారు. ఇద్దరిని పోలీస్ గార్డ్స్ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పీఎం పాలెం సీఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో గాలింపు చేపట్టగా సోమవారం ఉదయం సంజయ్, సాయి శ్యామ్ మృతదేహాలు లభ్యమయ్యాయి.