మంత్రి అచ్చేన్నాయుడుకు ఎమ్మెల్యే జయ సూర్య నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇవ్వాలని వినతి పత్రం
మంత్రిఅచ్చేన్నాయుడును ఓర్వకల్లు ఎయిర్పోర్టులో మంగళవారం నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయ సూర్య మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గం లోమొoథా తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించాలని వినతి పత్రాన్ని అందజేశారు,మంత్రి స్పందిస్తూ త్వరలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు, ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మండ్ర శివానందరెడ్డి, నందికొట్కూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు