చంద్రశేఖరపురం ఎస్సై వెంకటేశ్వర్లు నాయక్ ను ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఒంగోలులో సోమవారం అభినందించారు. చంద్రశేఖరపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించినందుకు ఎస్సై వెంకటేశ్వర్లు నాయక్ కు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అదేవిధంగా మండలంలో లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించినందుకు ఎస్సై కృషిని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రశంసించారు.