పాణ్యం: ఓర్వకల్లు మండల గుట్టపాడులో సిగాచి ఫార్మా, ఆర్పీఎస్ ఇండస్ట్రీస్ శిలాఫలకాల ఆవిష్కరణ
ఓర్వకల్లు మండలంలోని గుట్టపాడు గ్రామంలో ఏర్పాటు చేస్తున్న “సిగాచి ఫార్మా ఇండస్ట్రీస్ లిమిటెడ్” మరియు “ఆర్పీఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్” కు సంబంధించిన శిలాఫలకాలను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి , జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తదితరులు పాల్గొన్నారు.