అసిఫాబాద్: తిర్యాణిలో ఆదివాసీ గిరిజనులకు అన్యాయం చేస్తే ఊరుకోం: బీజేపీ మండల అధ్యక్షుడు రమేష్ గౌడ్
తిర్యాణి 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో 15 పడకలకు కుదించడంపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా శుక్రవారం బీజేపీ మండల పార్టీ నాయకులు ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపారు. 30 పడకల ఉన్న ఆసుపత్రిని 15 పడకల ఆసుపత్రిగా కుదించడంతో గిరిజనులకు అన్యాయం జరుగుతుందని బిజెపి మండల అధ్యక్షులు రమేష్ గౌడ్ అన్నారు. మండలంలో 90 శాతం మంది గిరిజనులు నివాసిస్తున్నారని పేర్కొన్నారు. 30 పడకల ఆసుపత్రిగా తిర్యానీ ప్రభుత్వ ఆసుపత్రిని కొనసాగించాలని లేనియెడల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతామని హెచ్చరించారు.