ప్రజా సమస్యలు పరిష్కరించాలిఅని అధికారులను ఆదేశించిన మంత్రి సవిత
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత బుధవారం మధ్యాహ్నం ప్రజలు, కార్య కర్తల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. వినతులు అందుకున్న వెంటనే అధికారులతో చర్చించి, సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించి త్వరగా పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తాను నిరంతరం ప్రజా సేవలో ఉంటానని తెలిపారు