జగిత్యాల: సోమవారం జిల్లా కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ సదస్సు : కార్యక్రమం కన్వీనర్ మానాల కిషన్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ సదస్సు సోమవారం జగిత్యాల పట్టణంలో జరగనున్నదని కార్యక్రమం కన్వీనర్ మానాల కిషన్ ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు.గత ఏప్రిల్ 14వ తేదీన అంబెడ్కర్ జయంతి సందర్భంగా జేఏసీ రాష్ట్ర కన్వీనర్ విశారధన్ మహారాజ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న “మా భూమి రథయాత్ర ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభమైందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని (ఆదిలాబాద్, నిర్మల్ )పూర్తి చేసుకోని ఈ నెల 15 న సోమవారం జగిత్యాల ఆవిర్భావ సదస్సు కి రానున్నట్టు కిషన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.